నేటి రోజుల్లో మాంసాహారం తినే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. కొంతమందికి ప్రతిరోజూ మటన్ చికెన్ లేనిదే ముద్దదిగని పరిస్థితి మరికొంత మంది రోజుకు కనీసం రెండు సార్లైన నాన్ వెజ్ తింటూ ఉంటారు. అయితే నాన్ వెజ్ ఎంత ఇష్టంగా తింటారో.. తిన్న తరువాత తగు జాగ్రతలు పాటించకపోతే అనారోగ్య సమస్యలు ఎదుర్కొక తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మటన్ చికెన్ వంటి నాన్ వెజ్ పదార్థాలలో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. అందువల్ల జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి నాన్ వెజ్ తిన్న తరువాత పాలు తేనె వంటివి తీసుకోకూడదు అలా తీసుకోవడం వల్ల అజీర్తి సమస్యలు తలెత్తుతాయి..
కొన్ని సందర్భాల్లో వాంతులకు కూడా దారి తీసే అవకాశం ఉంది. పాలలో జీర్ణక్రియను మందగించే కారకాలు ఉంటాయి. ఇక తేనె శరీర వేడిని పెంచుతుంది కాబట్టి నాన్ వెజ్ తిన్న తరువాత వీటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కూల్ డ్రింక్స్ వంటి శీతల రసాయనిక పానీయాలు కూడా తగకూడదని నెపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గ్యాస్టిక్ సమస్యలు ఏర్పడి కడుపు ఉబ్బరంగా మారుతుందట. టీ, కాఫీ వంటివాటికి కూడా దూరంగా ఉండాలట ఇవి కూడా ఆహారం త్వరగా జీర్ణం అవకుండా చేస్తాయి. కాబట్టి చికెన్, మటన్ వంటివి తిన్న తరువాత వీలైనంత వరకు వీటిని తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా జీర్ణ శక్తిని మెరుగుపరిచే నారింజ పండ్లు, ద్రాక్ష పండ్లు, అరటి పండ్లు వంటి వాటిని తినడం మంచిదని నిపుణుల సూచన.
Also Read:దిగ్విజయ్ సింగ్ సంచలనం..