దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఎన్నికలు మేలో జరగవచ్చు అంటూ…. తెలంగాణ ఎన్నికలపైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే.తారకరామారావు చేసిన కామెంట్స్ గా కొన్ని మీడియా ఛానళ్లు స్క్రోలింగ్స్ ప్రచారం చేస్తున్నాయి… అలాంటి ప్రస్తావన ఏమాత్రం రాలేదు దయచేసి అవాస్తవాలను ప్రచారం చేయవద్దని సూచించారు.
ప్రగతిభవన్లో చిట్ చాట్ లో మాట్లాడిన కేటీఆర్..అభ్యర్థుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో brs పార్టీకి మరింత సానుకూల వాతావరణం ఉందన్నారు. 90 స్థానాలకు పైగా గెలుస్తాం, కెసిఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారన్నారు.క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ సమాచారం ప్రకారం కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి ఉండాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు అని తెలిపారు.పది సంవత్సరాలల్లో ప్రభుత్వం అందించిన పథకాలు, సంక్షేమ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలే అద్భుతంగా వివరిస్తున్నారన్నారు. ప్రజలకు చాలా స్పష్టత ఉంది, ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయన్నారు. కెసిఆర్ మరియు బిఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామరక్ష అని…ప్రతిపక్షల తాపత్రయం రెండవ స్థానం కోసమేనన్నారు.
Also Read:నమ్మాలా, వద్దా?.. మీమాంశలో అల్లు అర్జున్
సిట్టింగ్లకు సీట్లు ఇవ్వకుంటే మా దగ్గరికి వస్తారని ప్రతిపక్షాలు భావించాయి…తాను నిర్మించిన నాయకత్వం, పార్టీ నాయకులపైన తనకున్న నమ్మకం మేరకే కేసీఆర్ గారు సిట్టింగ్ స్థానాలకు సీట్లు ఇచ్చారన్నారు.కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు…65 సంవత్సరాల లో ప్రతిపక్షాలు పెట్టిన మెడికల్ కాలేజీలు ,కేవలం రెండు మెడికల్ కాలేజీలే అన్నారు. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు, నర్సింగ్ కాలేజీ ఇవ్వలేదు, నవోదయ పాఠశాల ఇవ్వలేదు అన్నారు.
Also Read;పిక్ టాక్ :ఉప్పొంగిన పరువాల విస్ఫోటనం

