సేవ్ టీటీడీ…వదంతులు నమ్మకండి

96
ttd
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి భక్తుల భారీ సంఖ్యలో తరలివస్తుండగా కొండపై ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కనిపిస్తోంది. ఇక టీటీడీకి సంబంధించి జరుగుతున్న అసత్య ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది.

టీటీడీ ‘సేవ్‌’ పేరుతో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అధికారులు తెలిపారు. ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్‌ ట్విటర్‌ పేజీ ద్వారా స్పందించారు. తిరుమల శ్రీవారికి కానుకల రూపంలో అందించిన కానుకల డిపాజిట్లను ఏపీ ప్రభుత్వం, టీటీడీ బోర్డు చైర్మన్‌ కలిసి తప్పుదోవ పట్టించబోతున్నారని వాట్సాప్‌ మెసేజ్ ద్వారా ప్రచారం చేస్తున్నారని దానిని నమ్మవద్దని కోరారు.

ఎవరూ ఈ మెసేజ్‌ని ఫార్వర్డ్ చేయవద్దని.. ప్రధాని కార్యాలయం పేరిట అక్కడ కనిపిస్తున్న నంబర్‌.. మన్‌కీ బాత్‌ ప్రొగ్రాంకు సంబంధించిందని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి మెసేజ్‌లను ఫార్వార్డ్ చేసి చిక్కుల్లో పడొద్దని సూచించారు.

- Advertisement -