దొండకాయ ఉపయోగాలు తెలుసా?

303
- Advertisement -

ఒగురుగా ఉండే కూరగాయలలో దొండకాయ కూడా ఒకటి. దీనితో రుచికరమైన కర్రీ, వేపుడు, సాంబారు వంటివి చేస్తుంటారు. అయితే దొండకాయ కూర ఇష్టంగా తినే వారు ఏస్థాయిలో ఉన్నారో దీనిని తినడానికి ఆసక్తి చూపని వారు కూడా అంతే స్థాయిలో ఉన్నారు. అయితే దొండకాయ తినడం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలిస్తే.. ప్రతిఒక్కరూ దొండకాయ తినడానికి కచ్చితంగా మొగ్గు చూపుతారు. కాబట్టి దొండకాయ తినడం వల్ల కలిగే లాభాలను తెలుసుకుందాం.

దొండకాయ చూడడానికి చిన్నగా కనిపించినప్పటికి ఇందులో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా బీటా కెరోటిన్ తో పాటు విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఏ వంటి పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. ఇందులో ఉండే పీచు పదార్థం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అంతే కాకుండా రక్తంలోని చక్కెర స్థాయిని కూడా అదుపులో ఉంచుతుంది. .ఇక దొండకాయలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, సోడియం, జింక్ వంటి ఖనిజ లవణాలు శరీర ఊష్ణోగ్రత లను సమతుల్య పరిచి రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి. ఇంకా దొండకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె సమస్యలను దూరం చేస్తాయి.

ఇక దొండకాయ యొక్క మొక్క ఆకులను ఆయుర్వేదంలో వివిద రకాల సమస్యల కోసం ఔషధ తయారీలో వాడతారు. అయితే దొండకాయ తినడం వల్ల మందబుద్ది, జ్ఞాపక శక్తి లోపించడం వంటి సమస్యలు వస్తాయనే అపోహ ఉంది. ఆది ఒట్టి అపోహ మాత్రమే అని ఆహార నిరభ్యంతరంగా దొండకాయ తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఏదైనా మితంగా తింటే ఆరోగ్యమే.. అమితంగా తింటే ప్రతిదీ అనారోగ్యమే కాబట్టి మనం తినే ఆహారంలో ప్రతిదీ కూడా మితంగా ఉండేలా చూసుకున్నప్పుడే వాటిలో ఉండే పోషకలు సమృద్ది గా మన శరీరానికి అందుతాయి .

Also Read:లవ్ గురు… లిరికల్ సాంగ్

- Advertisement -