ప్రపంచ అవయవ దాన దినోత్సవం..

72
- Advertisement -

అన్ని దానాలకు మించింది ఏంటి..? అన్నదానం..విద్యాదానం ఇలా అవసరాన్ని బట్టి చెప్పుకుంటాం..కానీ ప్రాణదానాన్ని మించింది ఏదైనా ఉంటుందా…? ఏదీ ఉండదు..అలా ప్రాణదానం చేసే అవకాశం ఒక్క అవయవదానంతోనే సాధ్యం.. అవును మనం మరణించినా మన అవయవాలు మరొకరికి జీవితాన్నిస్తాయి.. మనం మరణించినా వారి ద్వారా మళ్లీ జీవించే అవకాశాన్నిస్తాయి.. ఇంత అద్భుతమైన అవయవ దానం పట్ల ఏదీ అవగాహన.. ? ఎన్నో అపోహలు..ఎన్నో అనుమానాలు..మతాచారాలు..మూఢ నమ్మకాల కారణంగా మనం అవయవదానం అంటే వెనుకడుగు వేస్తున్నాం.

మీకు తెలుసా… రోడ్డు ప్రమాదాల్లో ఏటా లక్షా 30 వేల మంది చనిపోతున్నారు.. వీరిలో కేవలం 150 మాత్రమే అవయవదానం చేస్తున్నారు..ఇక కిడ్నీ వ్యాధులతో ఏటా 3లక్షల మంది చనిపోతున్నారు..అవయవదానంతో ఈ మరణాల్ని పూర్తిగా ఆపవచ్చు.. ఒక మనిషి అవయవదానంలో మరో ఏడుగురికి జీవం పోయొచ్చు అంటే ఇంతకంటే అద్భుతం ఏముంటుంది..మానవుడే దేవుడుగా మారే అవకాశం ఇంతకంటే ఏముంటుంది.

సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిని బ్రెయిన్ డెడ్ గా పరిగణిస్తారు. వారినుంచే అవయవాల్ని సేకరిస్తారు..ఇలా చనిపోయిన ఒక వ్యక్తి నుంచి 200 అవయవాల్ని, టిష్యూల్ని దానం చేయొచ్చు..కళ్లు, గుండె, కాలేయం, మూత్ర పిండాలు..ఊపిరి తిత్తులు, క్లోమం, పెద్ద పేగు, చిన్న పేగులు..ఎముకలు, మూలుగను దానం చేయొచ్చు. అలా కనీసం ఏడుగురికి ప్రాణదానం చేయొచ్చు.

Also Read:హ్యాపీ బర్త్ డే…శ్రీదేవి

చనిపోయాక అవయవాల మార్పిడి గంటల్లో జరిగిపోవాలి. గుండె ఆగి చనిపోతే కళ్లు, గుండె కవాటాలు వంటి వాటిని 6 నుంచి 24 గంటల్లోపు సేకరించవచ్చు.అవయవ దానం మనిషికి రెండో జీవితం.. అలాంటి ఈ గొప్ప కార్యక్రమం మహోద్యంగా సాగాలి.. విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంది.. అవగాహన కల్పించాల్సి ఉంది..ప్రతీ ఏటా రెండున్నర లక్షల మందికి కిడ్నీలు అవసరం.. ఐదు వేలమందికి గుండె మార్పిడి అవసరం ఉంది.. అందుబాటులో కనీసం ఐదు గుండెలు కూడా లేవు.. కంటి చూపు తెప్పించే కార్నియాలు నాలుగున్నర వేలు అందుబాటులో ఉంటే లక్ష మంది కంటి చూపు కోసం ఎదురుచూస్తున్నారు..

అవయవదానంపై మన సమాజంలో ఎన్నో అపోహలు రాజ్యమేలుతున్నాయి. కానీ మరణించిన వ్యక్తికి ఏమాత్రం పనికిరాని అవే అవయవాలు మరెందరి ప్రాణాలనో నిలబెడతాయి. అలా కాదని ఖననం చేస్తే విలువైన అవయవాలు వృథాగా మట్టిలో కలిసిపోతాయి. దహనం చేస్తే కాలిపోతాయి. మట్టిలో కలవడం కంటే… కాలడం కంటే ఇతరులకు ప్రాణదానం చేయడం ఎంతో మేలు. ప్రతివారిలోనూ అవగాహన కలిగినప్పుడు మరెందరో అవయవార్థులు జీవం పుంజుకొని సమాజంలో తమవంతు బాధ్యతలను పోషిస్తారు. అందుకే అవయవదానంపై అపోహలు తొలగి మరింత మంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

Also Read:ప్రభాస్ అందుకే సర్జరీ చేయించుకుంటున్నాడు!

- Advertisement -