అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 12దేశాల పౌరులు అమెరికా రాకపై నిషేధం విధించారు. అఫ్గానిస్థాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్ దేశాలు ఈ నిషేధ జాబితాలో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.
బురుండి, క్యూబా, లావోస్, సియెరా లియోన్, టోగో, తుర్కయేనిస్థాన్, వెనెజువెలా వంటి దేశాలపై పాక్షిక నిషేధం విధించారు. కొలరాడోలో ఇటీవల యూదులపై సీసాబాంబులతో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ట్రంప్ మొదటిసారి పదవి చేపట్టిన సమయంలోనూ ఏడు ముస్లీం దేశాలపై నిషేధం విధించారు. ఈ మేరకు 2017 జనవరిలో ఒక కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులు అమెరికాలోకి రావడాన్ని నిషేధించారు.
Also Read:ప్రపంచ పర్యావరణ దినోత్సవం..

