మోదీపై ట్రంప్ ప్రశంసలు..

1
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసలు గుప్పించారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్… మోదీని చాలా తెలివైన వ్యక్తిగా అభివర్ణించారు. మోడీ నాయకత్వంలో భారతదేశం పురోగమిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని తెలిపారు. మోదీతో తన స్నేహబంధం బలంగా ఉందని ట్రంప్ వెల్లడించారు.

భారతదేశం విధిస్తున్న సుంకాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయని…ఈ చర్చలు త్వరలో సానుకూల ఫలితాలను అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వాణిజ్య ఒప్పందాల ద్వారా రెండు దేశాల ఆర్థిక సంబంధాలు మరింత బలపడతాయని పేర్కొన్నారు.

భారత్-అమెరికా సంబంధాలు క్రమంగా మెరుగవుతున్నాయని, ఈ బంధాన్ని మరింత బలపర్చేందుకు ఇరు దేశాధినేతలు కృషి చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో వాణిజ్య ఒప్పందాలు, రక్షణ రంగంలో సహకారం, సాంకేతిక అభివృద్ధి వంటి అంశాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేసే అవకాశం ఉందని వెల్లడించారు.

Also Read:మయాన్మార్‌ భూకంపం..పెరుగుతున్న మృతుల సంఖ్య

- Advertisement -