- Advertisement -
భారత్, పాకిస్తాన్ దాడులపై మరోసారి స్పందించారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. రెండు దేశాలు టిట్ ఫర్ టాట్ లాగా చేస్తున్నారు.. ఈ సమస్యను పరిష్కరించుకొని ఇంతటితో దీన్ని ఆపేస్తారని ఆశిస్తున్నా అన్నారు. రెండు దేశాలతో నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి.. ఈ గొడవలు ఆపుతారంటే నాకు చేతనైన సాయం చేస్తానని చెప్పారు ట్రంప్.
ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి అని సూచించారు ట్రంప్. ఇరు దేశాల మధ్య పరిస్థితిలు చాలా దారుణంగా ఉన్నాయి.. భారత్, పాక్‌లు దశాబ్దాలుగా గొడవ పడుతున్నాయి అని తెలిపారు. రెండు శక్తివంతమైన దేశాలు రోడ్లపైకి వచ్చి ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోరు… ప్రపంచానికి శాంతి కావాలి.. ఘర్షణలు వద్దు అని ఇప్పటికే వెల్లడించారు ట్రంప్.
Also Read:మండాడిలో విలన్‌గా సుహాస్
- Advertisement -

