హార్వర్డ్ యూనివర్సిటీపై డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా నిషేధం విధించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు హార్వర్డ్ సర్టిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోల్యాండ్ సెక్యూరిటీ లేఖ కూడా పంపింది.
ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న విదేశీ విద్యార్థులు మరో వర్సిటీకి బదిలీ కావాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.ఈ రూల్స్ ఎవరైనా బ్రేక్ చేస్తే చట్టబద్ధ హోదా కోల్పోతారని లేఖలో పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్రమ వలసల కట్టడే లక్ష్యంగా డిపొర్టేషన్ పేరుతో అనుమతులు లేకుండా యూఎస్‌లోకి ప్రవేశించిన వ్యక్తులపై అమానుషంగా వ్యవహరించి..చేతులకు బేడీలు వేసి బ్రెజిల్, కెనడా, మెక్సికో తోపాటు భారత్ పౌరులను తిరిగి సైనిక విమానాల్లో స్వదేశాలకు సాగనంపారు.
అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ విదేశీ విద్యార్థుల పట్ల యూఎస్ ప్రెసిడెంట్ వ్యవహరించిన తీరును తీవ్రంగా ఆక్షేపించింది. ట్రంప్ తీరుతో అమెరికా యూనివర్సిటీ పేరు ప్రతిష్టలు దిగజారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆగ్రహించిన ట్రంప్..ఆ విశ్వవిద్యాలయానికి నిధులు కోత పెడుతు ఆర్డర్ జారీ చేశాడు. తాజాగా విదేశీ విద్యార్థులను చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు.
Also Read;ఓటీటీలోకి సారంగపాణి జాతకం

