అమెరికా అధ్యక్షుడిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు డోనాల్డ్ ట్రంప్. 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా భారత్ కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.
ట్రంప్ ప్రమాణస్వీకారంపై వాతావరణం ప్రభావం చూపనుంది. వాషింగ్టన్‌లో మంచు, చలి కారణంగా ఇండోర్‌లోనే ప్రమాణం చేయనుండగా షింగ్టన్‌లో ఉష్ణోగ్రత మైనస్ 11 డిగ్రీలుగా ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేసింది. 40 ఏళ్ల తర్వాత ఇండోర్ లో అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉండనుంది.
ఇక ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో అంబానీ కుటుంబానికి ప్రత్యేక ఆహ్వానం అందింది. భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ ,ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈఓ జెఫ్ బెజోస్, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌లు కూడా ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. పలు దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు సైతం ఈ హాజరుకానుండగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రమాణం చేశాక ట్రంప్ ప్రారంభోపన్యాసం ఇవ్వనున్నారు. అమెరికా ఐక్యతే థీమ్‌గా తన ఉపన్యాసం ఉంటుందని ట్రంప్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.
Also Read:రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే: హరీశ్