హార్వర్డ్ యూనివర్సిటీకి షాకిచ్చాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. యూనివర్సిటీకి రూ. 19,000 కోట్ల గ్రాంట్లు, కాంట్రాక్టులు నిలిపివేశాడు. యూనివర్సిటీలో యాక్టివిజంను పరిమితం చేయాలని తెలపడంతో పాటు యూనివర్సిటీ విధానాలను మార్చాలని పేర్కొన్నారు ట్రంప్. ట్రంప్ సూచనలకు నో చెప్పింది హార్వర్డ్ యూనివర్సిటీ.
దీంతో హార్వర్డ్‌కు $2.2 బిలియన్ ఫెడరల్ ఫండింగ్ నిలిపివేశారు. అయితే ట్రంప్ ఫండ్ నిలిపివేయడంపై హార్వర్డ్ ప్రెసిడెంట్ అలెన్ గార్బర్.. విద్యార్థులకు ఓ లేఖ రాశారు. హార్వర్డ్ తన స్వతంత్రత, రాజ్యాంగ హక్కుల కోసం రాజీ పడదు అని స్పష్టం చేశారు.
దీనిపై ట్రంప్ నాయకత్వంలోని జాయింట్ టాస్క్ ఫోర్స్ టు కాంబాట్ యాంటీ-సెమిటిజం స్పందిస్తూ గ్రాంట్లు $2.2 బిలియన్, అదనంగా $60 మిలియన్ విలువైన గవర్నమెంట్ కాంట్రాక్టులను నిలిపివేసినట్లు ప్రకటించింది.
Also Read:TTD:ముగిసిన కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

