ట్రంప్ బంపర్ ఆఫర్..గోల్డ్ కార్డు!

2
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంపన్న శరణార్థుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించాడు. 5 మిలియ‌న్ల డాల‌ర్లకు అమెరికా పౌర‌స‌త్వం ఇవ్వనున్నట్లు తెలిపాడు. ఇందుకోసం గోల్డ్ కార్డు ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు.

అయిదు మిలియ‌న్ల డాల‌ర్ల‌(సుమారు 44 కోట్లు)కు అమెరికా పౌర‌స‌త్వం ఇవ్వనున్నట్లు తెలిపారు. గోల్డ్ కార్డుతో గ్రీన్ కార్డు రెసిడెన్సీ స్టాట‌స్ వ‌స్తుంద‌ని, దీని ద్వారా విదేశీయుల‌కు అమెరికా పౌర‌స‌త్వం పొందే మార్గం సులువు అవుతుంద‌ని తెలుస్తోంది. సుమారు 10 ల‌క్ష‌ల గోల్డ్ కార్డుల‌ను మంజూరీ చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప్రాథ‌మికంగా అంచ‌నా వేస్తున్నారు.

ఈబీ-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్ట‌ర్ వీసా ప్రోగ్రామ్ స్థానంలో గోల్డ్ కార్డు ఆఫ‌ర్ల‌ను ఇవ్వ‌నున్న‌ట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈబీ-5 ప్రోగ్రామ్ ద్వారా అమెరికాలో పెట్టుబ‌డి పెట్టే విదేశీయుల‌కు గ్రీన్ కార్డు ఇస్తారు.

Also Read:చద్దన్నం..ఉపయోగాలు తెలుసా?

- Advertisement -