డోనాల్డ్ ట్రంప్ అరెస్ట్…

29
- Advertisement -

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు సిద్ధయవుతున్న ట్రంప్‌ అరెస్ట్ అయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జార్జియా ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారనే అభియోగాలు నమోదు కావడంతో ఈ కేసులో ట్రంప్‌ను అరెస్ట్ చేశారు.

2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జార్జియా రాష్ట్ర ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసులు ఆయనపై నమోదైన నేపథ్యంలో లొంగిపోవాల్సి ఉంది. ఈ మేరకు జార్జియా జైల్‌ వద్ద గురువారం ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయన స్వయంగా ఫుల్టన్‌ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయి.. రెండు లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను సమర్పించారు. దీంతో బెయిల్‌ తీసుకొనేందుకు అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్ని ఫాని విల్లీస్‌ అనుమతించారు. ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత బెయిల్‌పై బయటికొచ్చారు ట్రంప్.

ట్రంప్‌పై నమోదైన నాలుగు క్రిమినల్‌ కేసు ఇది. ఇక తాజాగా కేసులో ట్రంప్‌ సహా 18 మందిపై అభియోగాలు మోపారు. నిందితుల జాబితాలో డొనాల్డ్ ట్రంప్‌ మాజీ లాయర్‌ రూడీ గులియానీ, వైట్‌హౌస్ మాజీ చీఫ్‌ మార్క్‌ మెడోస్‌, వైట్‌‌హౌస్‌ లాయర్‌ జాన్‌ ఈస్ట్‌మన్‌, జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌‌కు చెందిన మాజీ న్యాయమూర్తి జెఫ్రీ క్లార్క్‌ తదితరులు ఉన్నారు.

Also Read:అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్‌..ఇదొక చరిత్ర:నవీన్ యెర్నేని

- Advertisement -