ట్రంప్ మరో సంచలనం..

8
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి సిద్ధమయ్యారు. అర్ధరాత్రి 2 గంటలకు ట్రంప్ కీలక ప్రకటన చేయనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం.. ఈ రోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు(అంటే భారత్‌లో అర్ధరాత్రి 2 గంటలకు) ఓవల్ ఆఫీసులో కీలక ప్రకటన చేయనున్నారు ట్రంప్.

భారత్‌పై సుంకాల గురించి ట్రంప్ పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన దేని గురించి అంటూ సర్వత్రా చర్చ మొదలైంది. టారిఫ్స్ విషయంలో ఇప్పటికే భారత్‌కు వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. భారత్‌పై టారిఫ్స్ భారీగా పెంచబోతున్నా అని హెచ్చరించాడు. రష్యా నుంచి భారత్ భారీ స్థాయిలో ఆయిల్ కొనుగోలు చేయడమే కాదు, ఓపెన్ మార్కెట్ లో అధిక లాభాలకు అమ్ముకుంటోందని ట్రంప్ ఆరోపించారు.

రష్యా చమురు కొనుగోలు కారణంగా, భారత్ USA కి చెల్లించే సుంకాన్ని తాను గణనీయంగా పెంచుతాను అని ట్రంప్ హెచ్చరించారు.

Also Read:బీసీలను మోసం చేస్తున్న బీజేపీ: కవిత

- Advertisement -