ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్

5
- Advertisement -

మలయాళ స్టార్ మమ్ముట్టి నటించిన మిస్టరీ కామెడీ థ్రిల్లర్ చిత్రం ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంతో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ మలయాళంలో దర్శకుడిగా తొలిసారి పరిచయమయ్యారు.

అయితే, డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా విడుదలైన సమయంలో మిశ్రమ సమీక్షలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. థియేటర్లలో విడుదలై దాదాపు ఏడాది గడిచిన తర్వాత, ఈ చిత్రం ఇప్పుడు ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది.

ఈ సినిమా అసలు మలయాళ వెర్షన్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ డబ్బింగ్ వెర్షన్లలో కూడా ZEE5లో అందుబాటులో ఉంది. మొదట్లో డబ్బింగ్ వెర్షన్ల గురించి ప్లాట్‌ఫామ్ ఎలాంటి సమాచారం ఇవ్వకపోయినా, అనుకోకుండా ఇప్పుడు అన్ని భాషల్లో స్ట్రీమింగ్‌లోకి రావడం ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌గా మారింది.

ఈ చిత్రాన్ని మమ్ముట్టి కంపానీ బ్యానర్‌పై మమ్ముట్టి స్వయంగా నిర్మించారు. ఇందులో గోకుల్ సురేష్, సుష్మిత భట్, విజీ వెంకటేష్, సిద్ధిక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Also Read:వనపర్తిలో చిన్నారెడ్డి VS మేఘారెడ్డి

- Advertisement -