అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వ్యవస్థలో మార్పులు మరియు దేశంలోని వృథా ఖర్చుల తగ్గింపు లక్ష్యంగా ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ ( DOGE ) శాఖను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ఫెడరల్ బ్యూరోక్రసీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, 2026, జులై 4న అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే లోపు ఈ లక్ష్యాలను సాధిస్తామని గతంలోనే అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.అయితే, నిర్ణీత గడువు కంటే దాదాపు ఎనిమిది నెలల ముందే (DOGE) ను మూసివేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
దీని అర్థం, అనుకున్న లక్ష్యాలను ప్రభుత్వం గడువుకు ముందే సమర్థవంతంగా సాధించిందని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ వ్యవస్థలో సంస్కరణలు మరియు ఆర్థిక క్రమశిక్షణ పరంగా ఇది ఒక ముఖ్యమైన పరిణామంగా చూడబడుతోంది.
Also Read:రేవంత్ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్


