- Advertisement -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు వికారాబాద్,పరిగి లో గల పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ చైర్మన్ డా కొప్పుల శ్రీదీప్తి మరియు వారి సొసైటీ బృందం. ఈ సందర్భంగా శ్రీదీప్తి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు పరిగి లో గల పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ లో మొక్కలు నాటడం జరిగింది అన్నారు. మొక్కలు రేపటి తరాలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయన్నారు.
మంచి ఆక్సీజన్, మంచి వాతావరణం కావాలంటే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.తమ కాలేజ్ లో ఉన్న 1300 మందితో మొక్కలు నాటించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అవష్యకతను తెలియచేబుతాము అన్నారు.ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -