- Advertisement -
భారీ వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరైన కెరళ రాష్ట్రం కోలుకోలేనంతగా దెబ్బతినింది. ప్రకృతి ప్రకోపానికి గురైన కెరళకు వరదల బీభత్సం వల్ల రూ.2 లక్షల కోట్ల వరకు నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 134 వంతెనలు ధ్వంసమయ్యాయి.
రోడ్లు, వంతెనల నష్టమే రూ.13,800 కోట్లుగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా 40వేల హెక్టార్లలో పంటనష్టం వాటిల్లింది. రాష్ట్రంలో కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. ఇక ఇప్పటివరకు భారీ వర్షాలు, వరదల వల్ల ఇప్పటి వరకు 400 మంది ప్రాణాలు కోల్పోగా, 4 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కాగా..మధ్య కెరళలోని త్రిసూర్, అలువా, ఇడుక్కి ప్రాంతాలు భారీగా దెబ్బతిన్నాయి.
..
- Advertisement -