జగన్ ను ప్రజలు నమ్ముతారా ?

36
- Advertisement -

ఏపీలో వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించి మరో 30 ఏళ్లవరకూ వైసీపీనే అధికారంలో కొనసాగుతుందని నిన్న మొన్నటి వరకు ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి కలలు కంటూ వచ్చారు. అయితే పట్టభద్రుల ఎన్నికల్లో ఊహించని విధంగా టీడీపీ పూనుకోవడం, స్థానికంగా వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజలు తిరుగుబాటు చేస్తుండడం వంటి కారణాలతో ప్రస్తుతం మరోసారి అధికారంలోకి వస్తే చాలనుకుంటున్నారు సి‌ఎం జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టి మల్లకుండా జగన్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు.

ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వస్తున్న నేతలను, ఎమ్మెల్యేలను నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో జనంలోనే ఉంచడం, అలాగే తాము అమలు చేసిన పథకాలను ప్రజలు మర్చిపోకుండా నిత్యం ప్రజాలకు గుర్తుండేలా ఇంటింటికి స్టిక్కర్లని, గృహ సారథులని ఇలా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చేపడుతున్న ప్రజల్లో జగన్ సర్కార్ పై ఏర్పడుతున్న వ్యతిరేకత మాత్రం తగ్గడం లేదు. దీంతో చంద్రబాబు ప్రభుత్వానికి తన ప్రభుత్వానికి తేడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు సి‌ఎం జగన్మోహన్ రెడ్డి. తాజాగా బాపట్లనో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. 14 ఏళ్ళు సి‌ఎం గా ఉన్న చంద్రబాబు అమలు చేసిన ఒక్క పథకం కూడా గుర్తుకురాదని, కానీ మన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల మదిలో చిరస్థాయిగా గుర్తిండిపోతాయని జగన్ చెప్పుకొచ్చారు.

Also Read: పార్టీ విలీనమే.. షర్మిల ముందున్న మార్గమా ?

వచ్చే ఎన్నికలు పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతున్న పోరు అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు పొత్తులు, ఎత్తులు, కుయుక్తులనే నమ్ముకున్నారని, తాను మాత్రం ప్రజలనే నమ్ముకున్నని జగన్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్ ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తుకు రెడీ అవుతుండడంతో వైసీపీ ఓటు బ్యాంకుకు భారీగానే గండి పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తనకు ఎవరి అండా లేదని తనకు ప్రజామద్దతు ఉందని అందువల్ల వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తానని సి‌ఎం జగన్ చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే వైసీపీకి ప్రజా మద్దతు ఉంటుందా ? వైఎస్ జగన్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా ? అనే సమాధానం చెప్పలేని పరిస్థితి. మరి జగన్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Also Read: కర్నాటక ఎఫెక్ట్.. ” బీజేపీ డిఫెక్ట్ ” !

- Advertisement -