రాబోయే మార్చి నెల ఓ ముగ్గురి హీరోలకు అత్యంత కీలకంగా మారింది. వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న వరుణ్ తేజ్, గోపిచంద్, అల్లరి నరేష్.. వంటి హీరోల కొత్త సినిమాలు వచ్చే నెల రిలీజ్ కానున్నాయి. అందరి కంటే ముందు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ” ఆపరేషన్ వాలెంటైన్ ” మూవీ తో మార్చి 1 న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వరుణ్ తేజ్ గత చిత్రాలు ” గని “, ” గండివ ధారి అర్జున “, వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో వరుణ్ కెరీర్ మళ్ళీ గాడిన పడాలంటే ” ఆపరేషన్ వాలెంటైన్ ” తో తప్పక హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మూవీపై పెద్దగా బజ్ లేకపోయినప్పటికి ప్రాజెక్ట్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు వరుణ్ తేజ్. మరి ఈ మూవీతో నైనా హిట్ కొడతాడేమో చూడాలి. .
ఇక వరుణ్ తేజ్ తో పాటు మ్యాచో స్టార్ గోపిచంద్ కూడా మార్చి లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈయన నటిస్తున్న తాజా చిత్రం ” భీమా ” మార్చి 8 న విడుదల కానుంది. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ మూవీ పై గోపిచంద్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు. లౌక్యం తర్వాత గోపీచంద్ నటించిన చిత్రలేవి బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయాయి. అందువల్ల ” బీమా ” తో ఎలాగైనా హిట్ కొట్టాలని గోపిచంద్ పట్టుదలగా ఉన్నాడు.
ఇక కెరీర్ మొదట్లో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే అల్లరి నరేష్ ఆ తరువాత రూట్ మార్చి కాస్త సీరియస్ రోల్స్ లో మెప్పించే ప్రయత్నం చేశాడు. ఆ కోవలోనే వచ్చిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం వంటి సినిమాలు నిరాశ పరిచాయి. దాంతో మళ్ళీ పాత ఫార్ములానే ఎంచుకొని కామిడీ బేస్ గా ” ఆ ఒక్కటి అడక్కు ” అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ మార్చి 22న రిలీజ్ కాబోతుంది, మరి ఈ మూవీతో అల్లరోడికి హిట్ వస్తుందో లేదో చూడాలి. మొత్తానికి ఈ ముగ్గురి హీరోలకు మార్చి నెల కీలకం కావడంతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.
Also Read:ఈ ఆకు గురించి తెలిస్తే.. తినకుండా ఉండలేరు!