తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని టీఆర్ఎస్ నేత,ఎంపీ డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడిన డీఎస్ తాను కాంగ్రెస్‌లో చేరనని ఖరాఖండిగా చెప్పినా అలాంటి వార్తలు రావడం బాధాకరమన్నారు. కొన్ని పత్రికలు, ఛానల్స్‌కు ఇష్టమొచ్చిన వార్తలు రాయడం పరిపాటిగా మారిందన్నారు. జర్నలిజం విలువలను దెబ్బతియకూడదన్నారు.
అసత్య వార్తలను రాయడం, ప్రచురించడంతో ఆ సంస్థల క్రెడిబులిటీ తగ్గుతుందన్నారు. కొంతమంది పనిగట్టుకుని తన గౌరవాన్ని తగ్గించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వార్త ప్రచురించిన వారిపై ఆ సంస్థ చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధనకై పనిచేస్తానని చెప్పారు.
తాను కాంగ్రెస్‌లో చేరడం లేదని మళ్లీ మళ్లీ ఇలాంటి వార్తలు ప్రచురించవద్దని కోరారు డీఎస్. భవిష్యత్తులో ఇలాంటి వార్తలు ప్రచురిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.