- Advertisement -
వర్కింగ్ ప్రెసిడెంట్ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఇవాళ చెన్నై పర్యటనలో కేసీఆర్ డీఎంకే అధినేత కరుణానిధి,స్టాలిన్‌తో బేటీ అయ్యారు. భేటీ అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈసందర్భంగా చర్చించామని తెలిపారు.
రాబోయే కాలంలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై చర్చంచామని, ఫ్రంట్ పై పలుమార్లు సమావేశమై చర్చించాలనుకున్నామని స్టాలిన్ తెలిపారు. తమిళనాడులో తమ నిర్ణయంతో కొన్ని పార్టీలు కలిసి వస్తున్నాయని కూడా వెల్లడించారు. ఇతర పార్టీల అధ్యక్షులతో చర్చిస్తామన్న స్టాలిన్..పార్టీలో సీనియర్ నేతలతో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ తో తెలిపినట్లు వెల్లడించారు. విద్యాశాఖను రాష్ట్రాలకే బదలాయించాలని ఆయన ఈ సందర్భంగా తెలుపుతూ..కరుణానిధి ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారన్నారని చెప్పారు.
- Advertisement -