దీపికాకు మద్దతుగా కనిమొళి…

558
deepika
- Advertisement -

దేశవ్యాప్తంగా జేఎన్‌యులో విద్యార్థులపై దాడి సంఘటన గురించి చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాయపడిన విద్యార్థులను పరామర్శించారు బాలీవుడ్ నటి దీపికా పదుకొణె. ఈ నేపథ్యంలో ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుండగా దీపికకు మద్దతుగా నిలిచారు డీఎంకే ఎంపీ కనిమొళి.

బుధవారం జేఎన్‌యూకు వెళ్లిన కనిమొళి….స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌తో మాట్లాడారు. గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కనిమొళి …. దీపికాపై జరుగుతున్న ట్రోలింగ్‌ను తప్పుబట్టారు. తను సినిమాలు చూడనని.. కానీ దీపికకు మద్దతుగా ఛపాక్‌ చూస్తానని చెప్పారు.

దీపికా జేఎన్‌యూకు వెళ్లిన తర్వాత ఆమె నటించిన తాజా చిత్రం ఛపాక్‌ను బామ్‌కాట్ చేయాలని కొంతమంది సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం దీపికాపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.

- Advertisement -