ఎన్నికల కోసమే హైడ్రా..డీకే అరుణ ఫైర్

9
- Advertisement -

రానున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల కలెక్షన్ల కొరకే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాని ఉపయోగిస్తున్నారు అని మండిపడ్డారు ఎంపీ డీకే అరుణ. అక్రమ కట్టడాలుంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇల్లు కట్టిస్తే, ఈ ప్రభుత్వం వచ్చి బుల్డోజర్లతో కూలగొట్టిస్తుందని దుయ్యబట్టారు. ఆ నాలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల కలెక్షన్ల కోసమే హైడ్రా పేరుతో రేవంత్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

అంధులు, వికలాంగులు అని చూడకుండా వారి ఇండ్లను కూల్చడమంటే ఈ ప్రభుత్వానికి మానవత్వం అనేది లేదు అని తెలిసిపోయిందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్. వికలాంగులు, అంధులు నివసిస్తున్న కాలనీలో అర్ధరాత్రి 400 మంది పోలీసులతో వెళ్లి వారిని బయటకి లాగేసి ఇళ్లను కూల్చడం బాధాకరం అన్నారు.

నిన్న జరిగిన సంఘటనను మీడియా సరిగ్గా చూపిస్తే అంధులు, వికలాంగుల పట్ల భారతదేశంలో ఇట్లా జరుగుతుందా అని మన దేశానికి చెడ్డపేరు వచ్చే పరిస్థితి ఉంటదన్నారు.

Also Read:వన మహోత్సవంలో పాల్గొనండి..పవన్ పిలుపు

 

- Advertisement -