DK Aruna:రేవంత్‌వి దొర మాటలు

30
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి పై బీజేపీ నేత డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ ను చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు….నాపై ముప్పేట దాడి చేస్తున్నారు అని మండిపడ్డారు. ఒక ఆడబిడ్డను ఓడించేందుకు రాక్షసులుగా, రాబందులగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు..ముఖ్యమంత్రి అనే సోయిని మరిచి రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. ఒక పాలమూరు బిడ్డ ఈ ప్రాంతం కోసం అన్ని రంగాల్లో కృషి చేస్తే అసూయ పడుతున్నారన్నారు.

రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం ఏనాడైనా పోరాటం చేశారా..ప్రధాని మోడీపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న నీ స్థాయి ఏంటి…నా బాగోతం ఎందో మీ బాగోతం ఏందో పాలమూరు చౌరస్తాలో తేల్చుకుందాం రండి అని సవాల్ విసిరారు. నీ మాటలు ఒక ముఖ్యమంత్రికి అగౌరవం…నువ్వు దొరవి నీది దొర కుటుంబం అని విమర్శించారు.

మాది రైతు కుటుంబం.. పేదల కోసం పోరాటం చేసిన చరిత్ర మాది…చిట్టెం నర్సిరెడ్డి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అన్నారు. మమ్మల్ని పండబెట్టి తొక్కుతారంటా..జాతి, రంగు గురించి మాట్లాడుతున్నారన్నారు. ఏం పాపం చేశాను.. పాలమూరు కి నేను చేసిన ద్రోహం ఏంటిది..ఇదేనా సంస్కారం ఆడ పిల్లల గురించి మాట్లాడేది అన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ బోగస్.. ప్రజలను మోసం చేస్తున్నారు..పచ్చి అబద్ధాలు మానేయ్ మిస్టర్ రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలు ఆగస్టు 15 లోపు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తావా…రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తూ ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఓటు అడగాలి.. ఎంపీ ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత కాంగ్రెస్ కు లేదు అన్నారు. ఒక్క మహిళను ఎదుర్కోవడానికి ఐదు సార్లు రేవంత్ పాలమూరు జిల్లాకు వచ్చారు…నరేంద్ర మోడీ మరోసారి ప్రజలు గెలవాలని కోరుకుంటుటే చూసి ఓర్వలేక ఆడపిల్ల అని చూడకుండా నీచమైన మాటలు మాట్లాడుతున్నారన్నారు.ప్రతి పాలమూరు ఆడ బిడ్డ ఆలోచించాలి.. ప్రజల మధ్య ఉండే నన్ను ఈ రకంగా భాష మాట్లాడుతున్నారు…వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పండన్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్ రేవంత్ రెడ్డి అని హెచ్చరించారు.

Also Read:తరుణ్ భాస్కర్‌తో ఈషా రెబ్బా

- Advertisement -