స్త్రీ ని గౌరవించని వారికి భవిష్యత్ ఉండదు అన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో భాగంగా మాట్లాడిన అరుణ.. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు.. స్త్రీ లేనిదే అసలు మానవ మనుగడే లేదు.. స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు నడయాడుతారు, అభివృద్దికి భీజం పడుతుందన్నారు.
ఎక్కడైతే స్త్రీ సంతోషంగా ఉంటే ఆ కుటుంబం దినదినాభివృద్ధి చెందుతుంది.. మహిళలు ఎందులోనూ తీసిపోరు అన్నారు. అన్నిరంగాల్లోను మేమేం తక్కువ కాదనీ నిరూపిస్తున్నారు… భువి నుంచి దీవి వరకు అన్ని రంగాల్లోనూ మహిళల ప్రావీణ్యం ఉందని తెలిపారు. తెలంగాణ డబుల్ ఇంజిన్ సర్కారు కావాలని కోరుకుంటున్నారు… ఈ పరిస్థితులను మనం సద్వినియోగం చేసుకోవాలి అన్నారు.
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.. తెలంగాణలోని ప్రతి గృహిణి బిజెపి వైపు చూస్తున్నారు అన్నారు. అలాంటి వారినందరినీ మనమంతా ఏకం చేయాలి .. మహిళల ఆశలు ఆశయాలు నిజం చేసేలా బీజేపీ మహిళా నేతలు ప్రతి ఒక్కరినీ కలవాలి అన్నారు. రాజకీయాల్లో మహిళలు రాజకీయాల్లో కి రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది .. అందుకే మనకు మోడీ 33 % రిజర్వేషన్ ఇచ్చారు అన్నారు. మోడీ ఇచ్చిన ఈ రిజర్వేషన్ల అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి … ఏబాధ్యత ఇచ్చిన మహిళను నిరూపించుకుంటారు అని మన ప్రధాని మోడీ నమ్మారు అన్నారు.
Also Read:సమగ్ర కుటుంబ సర్వేపై స్వతంత్ర హోదాతో కమిటీ

