గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ భర్త డీకే భరతసింహారెడ్డి కారు రోడ్డుప్రమాదానికి గురైంది. జిల్లాలోని మరికల్ మండలం ఎలిగండ్ల వద్ద భరతసింహారెడ్డి ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీకొట్టింది. అయితే సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండటం, సమయానికి ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. స్వల్పంగా గాయపడిన భరతసింహారెడ్డిని చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు.
ఆయనతోపాటు కారులోఉన్న మరో యువతికి కూడా గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు.. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్ వాహనంలో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స నిమిత్తం భరత సింహారెడ్డిని హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భరతసింహారెడ్డి ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.