బీజేపీ నుంచి వారంతా జంప్?

37
- Advertisement -

ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ బరిలో నిలిచే తొలి అభ్యర్థుల జాబితాను నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల విషయంలో గత కొన్నాళ్లుగా మల్లగుల్లాలు పడిన అధిష్టానం.. ఎట్టకేలకు 52 మంది అభ్యర్థులతో తొలి జాబితా ను విడుదల చేసింది. ఈ జాబితాలో బీసీలకు మహిళలకు అధిక ప్రదాన్యం కల్పించారు. అంతే కాకుండా ఈసారి ముగ్గురు ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపారు. వారిలో బండి సంజయ్, సోయమ్ బాపూరావు, దర్మపురి అరవింద్ ఉన్నారు. అయితే అభ్యర్థుల తొలి జాబిత ప్రకటనతో అసంతృప్త నినాదాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. గత కొన్నాళ్లుగా కాషాయ పార్టీలో అంతర్గత విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. .

చాలమంది సీనియర్ నేతలు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక తాజాగా ప్రకటించిన తొలి జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో వారంతా కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు టాక్. డీకే అరుణ, విజయశాంతి, జితేందర్ రెడ్డి, గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. వంటి వారికి మొదటి జాబితాలో చోటు దక్కలేదు. ఇక దసరా తరువాత విడుదల చేయనున్న రెండో జాబితాలో కూడా వీరికి చోటు దక్కే అవకాశం లేదని టాక్ వినిపిస్తోంది.

గత కొన్నాళ్లుగా వీరంతా కూడా పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. పార్టీలో తగిన ప్రదాన్యత లభించడం లేదని వీరంతా గత కొన్నాళ్లుగా తరచూ సమావేశం అవుతూ పార్టీపై వ్యతిరేక గళం వినిపిస్తూ వస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు మొదటి జాబితాలో వీరికి నిరాశే ఎదురవడంతో వీలైనంతా త్వరగా పార్టీకి టాటా చెప్పాలని భావిస్తున్నారట. అసలే అభ్యర్థుల కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న కాషాయ పార్టీకి ఉన్న నేతలు కూడా బై బై చెబితే ఆ పార్టీ మరింత బలహీన పడే అవకాశం ఉండి మరి బీజేపీ అధిష్టానం వీరిపట్ల దృష్టి సారిస్తుందా ? లేదా పొమ్మనలేక పొగ పెట్టెలా వ్యవహరిస్తుందా అనేది చూడాలి.

Also Read:మళ్లీ మృణాల్ తోనే ఫిక్స్ అట

- Advertisement -