విషాదం: ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆత్మహత్య !

35
- Advertisement -

హాలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అమెరికన్‌ హిప్‌హాప్‌ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్‌, నటుడు డీజే స్టీఫెన్‌ ఆత్మహత్య చేసుకుని, అభిమానులను, సన్నిహితులను శోక సంద్రంలోకి నెట్టేశాడు. గత వారం లాస్‌ ఏంజిల్స్‌లోని ఓ హాటల్‌లో దిగాడు డీజే స్టీఫెన్‌. నిన్నటివరకు హోటల్ మేనేజ్మెంట్ కి చాలా హుషారుగా కనిపించాడు. కానీ.. నిన్న రాత్రి డీజే స్టీఫెన్‌ ను ఓ అమ్మాయి వచ్చి కలిసింది.

అనంతరం అతను హోటల్ నుంచి బయటకు వెళ్లి వచ్చాడు. మరోవైపు డీజే స్టీఫెన్‌ కి వరుసగా కాల్స్ వస్తూనే ఉన్నాయట. కానీ ఏ కాల్ ను డీజే స్టీఫెన్‌ లిఫ్ట్ చేయలేదు. అతను మానసికంగా కూడా బాగా నీరసించిపోయాడట. ఆ బాధలోనే తన రూమ్ లోకి వెళ్ళిన డీజే స్టీఫెన్‌ గన్‌తో షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డీజే స్టీఫెన్‌ ఆత్మహత్యకు పాల్పడటానికి ముఖ్య కారణం ఓ అజ్ఞాత అమ్మాయిని అని అక్కడి మీడియా పేర్కొంది.

మరీ ఆమె ఎవరు ?, స్టీఫెన్ కు ఆమెకు ఏమిటి సంబంధం ? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. మరోవైపు డీజే స్టీఫెన్‌ మృతికి నటీనటులు సంతాపం తెలుపుతున్నారు. కాగా, ది ఎలెన్‌ డిజనరేస్‌ షో, సో యూ థింక్‌ యూ కెన్‌ డాన్స్‌’ వంటి రియాలిటీ షోలతో స్టీఫెన్‌ పాపులర్‌ అయ్యాడు. ఏది ఏమైనా ఎంతో భవిష్యత్తు ఉన్న డీజే స్టీఫెన్‌ ఇలా సడెన్ గా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం చాలా బాధాకరమైన విషయం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -