డీజే లుక్ లీకైంది…!

220
DJ Look Reaveled
- Advertisement -

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌ సినిమాలంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. డిఫరెంట్ కథా చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే బన్నీ సరైనోడు బ్లాక్ బస్టర్‌ హిట్‌ను తనఖాతాలో వేసుకున్నాడు. తర్వాత గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే.. దువ్వాడ జగన్నాథంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో ముందుకు తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ సినిమా గురించి అప్పుడప్పుడూ బయటికి వస్తున్న అప్ డేట్స్ తో సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాడు బన్నీ. ఇక ఈ చిత్ర టీజర్ మహాశివరాత్రి కానుకగా ఈ నెల 24న విడుదల కానుంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబందించి ఒక్కస్టిల్ కూడా బయటికి రాలేదు. ఈ నేపథ్యంలో ‘డీజే’ ప్రి లుక్‌తో బన్నీ అభిమానులను అలరించాడు.  ‘డీజే’లో బన్నీ బ్రాహ్మణ కుర్రాడి పాత్రను పోషిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుండగా.. దాన్ని నిజం చేసేలా ఉంది ప్రి లుక్. రుద్రాక్ష దండ.. అడ్డ నామాలు.. ఈ వ్యవహారం చూస్తుంటే లుక్ జనాల అంచనాలకు తగ్గట్లే ఉండొచ్చనిపిస్తోంది. డీజే లుక్ ఇన్ 2 డేస్ అంటూ ఈ రోజే హ్యాష్ ట్యాగ్ పెట్టి అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

DJ Look Reaveled

ఇక ఫస్ట్ లుక్‌ రిలీజ్‌కు ఒకరోజే సమయం ఉండగా బన్నీ డీజే లుక్ లీకైంది. పిలక పెట్టినట్లుగా దువ్విన జుట్టు.. ఒళ్లంతా విబూధి నామాలు.. పంచె కుట్టు.. కాషాయ వస్త్రం.. మెడలో యజ్ఞోపవీతం.. అబ్బో బన్నీ లుక్ అదిరిపోయిందంతే. ఇప్పుడు నెట్టింట్లో ఈ కొత్త లుక్ వైరలైంది. మొదటిసారిగా అల్లు అర్జున్ ఇలాంటి గెటప్ వేయడం హైలైట్. అయితే, ఇది ఫస్ట్ లుక్ కాదా అన్నది తెలియాల్సి ఉంది. నెలల తరబడి తన లుక్ లీక్ కాకుండా జాగ్రత్త పడ్డాడు అల్లు అర్జున్. కానీ సరిగ్గా ఫస్ట్ లుక్ రిలీజ్ ముందు రోజున ఫోటోలు లీక్ అయిపోవడం.. ఆశ్చర్యమే.

- Advertisement -