పగిలిపోయేలా వాయించిన డీజే…

188
DJ Duvvada Jagannadham Trailer
- Advertisement -

టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డీజే..దువ్వాడ జగన్నాథమ్. హరీష్‌శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘పబ్బుల్లో వాయించే డీజేను కాదురా..పగిలిపోయేలా వాయించే డీజేను, ఈ రోజుల్లో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్ఛామి కాదు సర్..యుద్ధం శరణం గచ్ఛామి’ అంటూ ట్రైలర్‌లో వచ్చే డైలాగ్స్ డీజేపై అంచనాలపై మరింత పెంచేస్తున్నాయి.

విడుదలైన కొద్దిగంటల్లోనే 25 లక్షలకు పైగా వ్యూస్, 89 వేల లైక్‌లను  సంపాదించి సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.ఒక వైపు బ్రాహ్మణ యువకుడి గెటప్‌లో, మరోవైపు సూట్‌లో బన్ని పాత్రను ఆసక్తికరంగా చూపించారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. జూన్‌ 23న ‘డీజే’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

- Advertisement -