హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్రాజు నిర్మించిన ‘డీజే-దువ్వాడ జగన్నాథం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.
దాంతో తన 25వ సినిమాగా డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాను నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, సినిమా టాక్ ఎలా ఉన్న కలెక్షన్లతో ఫుల్ ఖుషీ అవుతున్నాడు. తొలి వారాంతానికి అల్లు అర్జున్ కెరీర్లో హయ్యస్ట్ వీకెండ్ కలెక్షన్లు సాధించిన సినిమాగా డీజే నిలిచింది.
అయితే ఈ సినిమాని కూడ పైరసీ వదల్లేదు. డీజే పై పైరసీ ఎఫెక్ట్ గట్టిగానే పడింది. ‘డీజే’ సినిమా మొత్తాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ఫేస్బుక్లో అప్లోడ్ చేసేశారు.
ఇక అభిమానుల సాయంతో పైరసీ లింకులను గుర్తించిన డీజే చిత్ర యూనిట్ సభ్యులు.. పైరసీ దారులపై ఫిర్యాదు చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. దీంతో సినిమా పైరసీకి పాల్పడిన వారిపై చిత్రయూనిట్ పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది.
నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్ లు స్వయంగా ఈ కంప్లయింట్ ఇచ్చారు. కొన్ని వెబ్ సైట్స్ తో పాటు ఫేస్ బుక్ పేజ్ లపైన కూడా కంప్టయింట్ ఇచ్చినట్టుగా తెలిపారు.
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన డీజే దువ్వాడ జగన్నాథమ్ గత శుక్రవారం రిలీజ్ అయి భారీ ఓపెనింగ్స్ సాధించింది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు బాగానే వస్తుండటంతో సినిమా టాలీవుడ్ టాప్ 5 గ్రాసర్స్ లిస్ట్ లో చేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.