మొక్కలు నాటిన దియా,సచ్చేంద్ర

193
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా కొనసాగుతోంది. ప్రజలందరూ ఉత్సహాంగా పాల్గొంటూ మొక్కల ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. తాజాగా సినీనటి దియా మరియు మోడల్‌ సచ్చేంద్ర మొక్కలు నాటి పర్యావరణ సాక్షిగా మేము సైతం అని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా సచ్చేంద్ర మరియు దియా మాట్లాడుతూ… ఈ సందర్భంగా సచ్చేంద్ర మరియు దియా మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. సొసైటీ లో గ్రీనరీ పెంచే విధంగా ఈ ఛాలెంజ్ తీసుకురావడం అందులో అందరిని భాగస్వా మ్యం చెయ్యడం సంతోషంగా ఉందన్నారు.

మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా గ్రీనరీ పర్సెంటెజ్ పెరుగుతుంది అన్నారు. మేము ఇద్దరం ఎంగేజ్‌మెంట్ తర్వాత కలిసి మొక్కలను నాటడం ఇంకా ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మరో ముగ్గురిని నామినేట్ చేస్తూ జబర్దస్త్ పవిత్ర, శ్రవణ్, కృష్ణ వీరి ముగ్గురిని మొక్కలు నాటాలని సవాళ్లు విసిరారు.

 

ఇవి కూడా చదవండి..

కమల్…234వ చిత్రం

ఎన్నిక ఏదైనా ప్రజలంతా కేసీఆర్ వెంటే

మిస్టర్‌360…మన సూర్య భాయ్‌

- Advertisement -