ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది కేంద్ర ప్రభుత్వం. గవర్నమెంట్ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్(డీఏ)ను అయిదు శాతం పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఈవిషయాన్ని తాజాగా ప్రకటించారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్. ఈ నిర్ణయం వల్ల సుమారు 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, మరో 62 లక్షల మంది పెన్షర్లు లబ్దిపొందనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని పెంచాలన్న నిర్ణయాన్ని కేబినెట్ సమావేశంలో తీసుకున్నట్లు మంత్రి జవదేకర్ తెలిపారు. పెంచిన దానితో ప్రస్తుతం డీఏ 17 శాతానికి చేరుకుంటుంది. ఇది ఉద్యోగులకు దివాళీ బహుమతి అని కేంద్ర మంత్రి తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈనిర్ణయం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
DA for government employees increased by 5 %.
Around 50 lakh central government employees and 62 lakh pensioners to be benefited: Union Minister @PrakashJavdekar pic.twitter.com/W8BdKkdpGw— PIB India (@PIB_India) October 9, 2019