అమెరికాలో దీపావళి వేడుకలు

2
- Advertisement -

దీపావళి వేడుకలు అమెరికా అధ్యక్ష భవనం(వైట్ హౌస్‌)లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరు కాగా వైట్ హౌస్ మొత్తాన్ని దీపాలు, పుష్పాలతో అలంకరించారు. ఈ వేడుకలకు దాదాపు 600 మందికిపైగా అతిథులు హాజరయ్యారు.

ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌, జిల్‌ బైడెన్‌ గైర్హాజరుకాగా ఈ సందర్భంగా మాట్లాడిన బైడెన్… తన కార్యవర్గం విభిన్నమైన జాతులతో అమెరికాను ప్రతిబింబిస్తుందని అన్నారు.2003లో తొలిసారి జార్జి బుష్‌ శ్వేతసౌధంలో దీపావళి నిర్వహించారు. ఆ తర్వాత బరాక్‌ ఒబామా స్వయంగా ఓవల్‌ ఆఫీస్‌లో దీపం వెలిగించి పండుగను ప్రారంభించారు. ఆ తర్వాత ఈ సంప్రదాయాన్ని ట్రంప్‌ కొనసాగించారు.

అమెరికా అధ్యక్ష భవనంలో దీపావళి వేడుకల సందర్భంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ప్రత్యేక సందేశాన్ని పంపారు. అమెరికాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న.. అన్నింటా భాగస్వామి అవుతున్న జాతిగా దక్షిణాసియా వాసులు ఉన్నారన్నారు. అంతరిక్షం నుంచి సునీత విలియమ్స్‌ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకొంది.

Also Read:గ్రేటర్‌లో ఫ్లై ఓవర్‌ల నిర్మాణం వేగవంతం

- Advertisement -