- Advertisement -
హైదరాబాద్‌లో దీపావళి సందర్భంగా బాణాసంచా కాలుస్తూ 70 మంది బాధితులు గాయపడ్డారు. దీంతో సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో చేరారు బాధితులు. ప్రస్తుతం ఆసుపత్రిలో 70 మంది బాధితులు చేరగా ఇందులో 20 మంది చిన్నారులు ఉన్నారు.
వీరిలో ఇద్దరిని ఇన్ పేషంట్స్‌గా చేర్చుకొని అవసరమైతే రేపు సర్జరీ చేస్తామని తెలిపారు వైద్యులు. బాణసంచా కాల్చే సమయంలో రసాయనాలు పడి ఐ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు బాధితులు.
కంటి గాయాలతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసుపత్రికి తరలివచ్చారు. ఎంతమంది వచ్చినా చికిత్స అందించేందుకు ఆసుపత్రి యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆసుపత్రిలో చేరిన బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
Also Read:బస్తీ దవాఖానకు సుస్తీ?:హరీష్
- Advertisement -

