బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 54 రోజులు పూర్తి చేసుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన భరణి-శ్రీజలలో ఆడియన్స్ భరణి వైపు మొగ్గు చూపారు. దీంతో శ్రీజ మరోసారి హౌస్ నుంచి వెళ్లక తప్పలేదు. శ్రీజ వెళ్లేముందు కళ్యాణ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. పర్మినెంట్ హౌస్‌మెట్ అయిన భరణికి బిగ్‌బాస్ స్పెషల్ పవర్ ఇచ్చాడు.
ఈ వారం కెప్టెన్సీ కంటెండర్లుగా ఐదుగుర్ని సెలక్ట్ చేయాలని చెప్పగా ఇందులో కావాలంటే మీ పేరు కూడా పెట్టుకోవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. దీంతో భరణి తనకి ఈ వారం అంతా టాస్కుల్లో హెల్ప్ చేసినవాళ్లు, సపోర్ట్ చేసిన వాళ్లతో మీటింగ్ పెట్టి.. తనతో పాటు తనూజ, దివ్య, సాయి, నిఖిల్‌లని సెలక్ట్ చేశాడు.
తనని ఎందుకు సెలక్ట్ చేయలేదంటూ భరణి గురించి తనూజ, రీతూ దగ్గర డిస్కస్ చేసింది మాధురి. నేను స్టార్టింగ్ నుంచి ఆయనకి సపోర్ట్ చేస్తే నన్ను కాదని సాయిని సెలక్ట్ చేశాడు.. నేను ఎలిమినేట్ అయిపోతే తెలీదు కానీ ఉంటే మాత్రం నామినేషన్‌లో చెప్తాను అంటూ మాధురి అంది. ఇక కెప్టెన్సీ కోసం.. డీజే టాస్క్.. పెట్టాడు బిగ్‌బాస్. ఈ టాస్కులో భాగంగా ప్లే అవుతున్న మ్యూజిక్‌కి ఒక్కో కంటెండర్ డ్యాన్స్ చేయాలి.. ఆ డ్యాన్స్ చేసే వ్యక్తిని కెప్టెన్‌గా చూడాలనుకుంటే వాళ్లకి సపోర్ట్‌గా మరో ప్లాట్‌ఫామ్‌పై హౌస్‌మేట్స్ డ్యాన్స్ చేయాలి.. డ్యాన్స్ చేస్తున్న సపోర్టర్స్‌ని నచ్చనివాళ్లు కిందకి దించొచ్చు ..ఈ టాస్కుకి రాము సంచాలక్ అని చెప్పారు.
ముందుగా సాయి పేరు పిలిచాడు బిగ్‌బాస్. దీంతో సాయి ఒక స్టేజ్ మీద డ్యాన్స్ చేశాడు. ఇక సాయికి సపోర్ట్ చేస్తూ కేవలం సంజన మాత్రమే చివరి వరకూ ఉంది. దివ్యకి సపోర్ట్‌గా ఐదుగురు ,తనూజ కోసం మళ్లీ మాధురి,నిఖిల్‌కి సపోర్ట్‌గా ముగ్గురు నిలబడ్డారు. చివరగా భరణి డ్యాన్స్ చేస్తున్నప్పుడు మొత్తం నలుగురు సపోర్ట్‌గా నిలిచారు. ఇక చివరిగా తనూజ డ్యాన్స్ చేస్తుంటే అత్యధికంగా 8 మంది మద్దతు ఇచ్చారు. దీంతో చివరి రౌండ్‌కి టాప్-3 తీసుకుంటారా లేక టాప్-2 తీసుకుంటారా అని అందరూ ఎదురుచూశారు. చివరి రౌండ్ తనూజ-దివ్య మధ్య జరిగింది. తనూజ వైపు నలుగురు మాధురి, రీతూ, డీమాన్, కళ్యాణ్ సపోర్ట్‌గా నిలబడ్డారు. దివ్య వైపు సాయి, ఇమ్మూ, గౌరవ్, సుమన్ శెట్టి, సంజన నిల్చున్నారు. దీంతో సాంగ్ నడుస్తున్నంత సేపు భరణిని రావాలని మాధురి పిలిచింది. భరణి ఈక్వెల్ అవుతాం కనీసం సపోర్ట్ చేయండి.. అని మాధురి చెప్తున్నా భరణి మధ్యలోనే నిల్చున్నాడ. దీంతో కెప్టెన్ దివ్య అయిపోయింది.
Also Read:రూమర్స్‌పై డీవీవీ దానయ్య!

