సమ్మెను వాయిదా వేస్తున్నాంః విద్యుత్ ఉద్యోగులు

369
Employes
- Advertisement -

తమ సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు తెలంగాణ విద్యుత్ ఉద్యోగాలు. ఉద్యోగ కార్మిక సంఘం నేతలతో నగరంలోని విద్యుత్‌సౌధలో విద్యుత్‌ యాజమాన్యం నేడు చర్చలు చేపట్టింది. ఈ చర్చల్లో విద్యుత్‌ సంస్థల సీఎండీలు ప్రభాకర్‌రావు, రఘురామ్‌రెడ్డి, గోపాల్‌రావు పాల్గొన్నారు. దీంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి.

ఈసందర్భంగా విద్యుత్ ఉద్యోగులు మాట్లాడుతూ.. విద్యుత్ కార్మిక సంఘాల పట్ల సిఎండి ప్రభాకర్ రావు ఎంతో సుహృద్భావంతో ఉన్నారన్నారు. రాబోయే రోజులలో సీఎం కేసీఆర్ తో విద్యుత్ కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడిస్తానని హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖ యాజమాన్యాలు ఎంతో స్నేహ పూర్వకంగా ఉన్నాయి. విద్యుత్ కార్మికుల డిమాండ్ ల పట్ల యాజమాన్యం సానుకూలంగా ఉంది. ఆర్టిజన్ ల డిమాండ్ లను యాజమాన్యం ఒప్పుకున్నట్లు తెలిపారు. నవంబర్ మూడవ వారంలో మరోసారి చర్చిస్తామని చెప్పారు.

- Advertisement -