మెగాడాటర్ విడాకులు.. మళ్లీ అదే రచ్చ

23
- Advertisement -

మెగా డాటర్ నిహారిక విడాకుల వ్యవహారం మళ్లీ వార్తల్లో నిలిచింది. దీనికి కారణం నిహారికే. ఎన్నోసార్లు ఏడ్చేశా అంటూ నిహారిక.. చైతన్యతో విడాకులపై స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ మెగా డాటర్ మాట్లాడుతూ.. ‘ఒక్క ఏడాదిలోనే విడిపోతామని తెలిసి ఎవరూ అంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోరు కదా. ఎవరైనా జీవితాంతం కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లి చేసుకుంటారు. నేను అలాగే చేసుకున్నాను. కానీ, నా విషయంలో అలా జరగలేదు. విడాకుల బాధను తట్టుకోలేక నేను ఎన్నోసార్లు ఏడ్చేశాను’ అంటూ మెగా డాటర్ ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది.

అనంతరం నెటిజన్ల కామెంట్ల పై కూడా నిహారిక ఎమోషనల్ అయ్యింది. ‘ఆన్‌లైన్‌లో నా గురించి చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చూసి నేను ఎంతగానో బాధపడ్డాను. వారికేం తెలుసు, నా తప్పు లేదు అని’ అంటూ మొత్తానికి నిహారిక తన మాజీ భర్త చైతన్యను తప్పు బట్టేలా మాట్లాడింది. దీంతో, నిహారిక విడాకుల వ్యాఖ్యలపై ఆమె మాజీ భర్త చైతన్య కూడా తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. పైగా చైతన్య చేసిన కామెంట్స్ కూడా ఆలోచించే విధంగా ఉండటంతో ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.

ఇంతకీ, చైతన్య ఏం మాట్లాడాడు అంటే.. ‘ఏదైనా ఒక అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు రెండు వైపులా వాదనలు వినాలి. ఏకపక్షంగా ఆలోచించి అభిప్రాయాలను వెలిబుచ్చడం సరికాదు. దీని కోసం, సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం మానుకోవాలి. పరోక్షంగా బాధితులను ట్యాగ్ చేయొద్దు.’ అంటూ చైతన్య పేర్కొన్నాడు. కేవలం నిహారిక కామెంట్స్ ను ఉద్దేశించే చైతన్య పైవిధంగా మాట్లాడాడు అని అర్ధం అవుతుంది. మొత్తానికి నిహారిక – చైతన్య తమ విడాకుల వ్యవహారాన్ని మళ్లీ బజారున పెట్టుకుంటున్నారు.

Also Read:రాష్ట్రానికి అమిత్ షా..షెడ్యూల్ ఇదే

- Advertisement -