బ్రాహ్మణ పరిషత్‌కు రూట్ మ్యాప్ ఆవిష్కరణ

54
- Advertisement -
ఈ నెల 31న సీఎం కేసీఆర్ చేతులు మీదుగా బ్రాహ్మణ సదన్‌ ప్రారంభించనున్నారు. హైదరాబాద్ గోపన్‌పల్లిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని నిర్మించారు. ఉదయం 10.30నిమిషాలకు సీఎం కేసీఆర్ చేతులమీదుగా వేదపండీతుల మధ్య బ్రాహ్మణ పరిషత్‌ను ప్రారంభంకానుంది. కాగా ఈ కార్యక్రమానికి పీఠాధిపతులు, మత పెద్దలు రానున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేసింది. తాజాగా బ్రాహ్మణ సదన్‌కు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ను కూడా ఆవిష్కరించారు.  https://g.co/kgs/W8hKHh
దేశంలోని బ్రాహ్మణ ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. బ్రాహ్మణ పరిషత్ భావితరాలకు ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతుందన్నారు. బ్రాహ్మణ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయనుంది. ఈ మేరకు పౌరోహిత్యం నమ్ముకున్న బ్రాహ్మణ పిల్లలకు చదువులు అందించాలని వారి కోసం మల్లినాథసూరి సంస్కృత విశ్వవిద్యాలయంను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే అదేశించిన సంగతి తెలిసిందే.
- Advertisement -