‘డర్టీ గేమ్’ఆడియో విడుదల

198
- Advertisement -

“షిరిడీసాయి క్రియేషన్స్” పతాకంపై ఖయ్యుమ్ , అస్మిత హీరోహీరోయిన్ లుగా తాడి మనోహర్ కుమార్ ప్రత్యేక పాత్రలో, పరుచూరి గోపాలకృష్ణ మరియు సీనియర్ నటుడు సురేష్, కోట శ్రీనివాస రావు ప్రధాన పాత్రదారులుగా తాడి మనోహర్ కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘డర్టీ గేమ్’. షిరిడి సాయి మ్యూజిక్ కంపెనీ ద్వారా శ్రోతల ముందుకు వస్తున్న ఈ చిత్రంలోని పాటల వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా జరిగింది . తొలి సీడి ని సీనియర్ దర్శకుడు సాగర్ మరియు ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్ లు సంయుక్తంగా ఆవిష్కరించారు.

చిత్ర సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మాట్లాడుతూ పూరీ జగన్నాద్ లాంటి మేటి దర్శకులతో పని చేసిన నేను “డర్టీ గేమ్ ” కథ బాగా నచ్చడం తో ఈ సినిమా చేస్తున్నాను . దర్శకుడు తాడి మనోహర్ కుమార్ నా దగ్గర నుంచి మంచి ఆడియో రాబట్టారు . ప్రేక్షుకులందరికి ఈ సినిమా పాటలు నచ్చుతాయని ఆశిస్తున్నాను అని అన్నారు .

DirtyGame
దర్శకనిర్మాత తాడి మనోహర్ కుమార్ మాట్లాడుతూ నటీనటులు మరియు టెక్నీషియన్ల సంపూర్ణ సహకారంతో ఈ చిత్రాన్ని అనుకున్న టైం లో నిర్మించాను. వారందరికీ నా కృతఙ్ఞతలు. సునీల్ కశ్యప్ అందించిన ఆడియో ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ గా నిలుస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటీ నటులు కవిత మరియు జీవి, కోట శంకర్ రావు, సునీల్ కుమార్, ఖయ్యుమ్ , అస్మిత అతిథిలుగా హాజరయ్యారు.

ఈ చిత్ర ప్రధాన తారాగణం : ఖయ్యుమ్ , అస్మిత, తాడి మనోహర్ కుమార్, కోట శ్రీనివాసరావు, సురేష్, పరుచూరి గోపాలకృష్ణ, సునీల్ కుమార్, రాజి నాయర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు: అక్కపెద్ది వెంకటేశ్వరశర్మ, సినిమాటోగ్రఫీ: బి యస్ కుమార్, ఎడిటింగ్: బస్వా పైడి రెడ్డి, మ్యూజిక్ :సునీల్ కశ్యప్,నిర్మాత & దర్శకుడు: తాడి మనోహర్ కుమార్

- Advertisement -