పూరి ‘హగ్’పై వర్మ ప్రశంసలు!

223
- Advertisement -

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సరికొత్త ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టారు. తన తొలి షార్ట్ ఫిల్మ్ ‘హగ్’ను త్వరలో విడుదల చేస్తానని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. యుట్యూబ్ వెబ్ సిరీస్‌తో సంచలనం సృష్టించేందుకు డిసెంబర్ 31న ముందుకు రానున్నాడు. అయితే తన గురువు రాంగోపాల్ వర్మ దారిలోనే షార్ట్‌ ఫిల్మ్స్‌ బాటపట్టారు పూరి. ఇటు వెండితెర మీద కంటిన్యూ అవుతూనే, తొలి షార్ట్ ఫిల్మ్ విడుదల చేయడానికి సిద్దమైయ్యాడు.

ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా స్పందించారు. ‘పూరీ జగన్ ‘హగ్’ మొత్తం ఇప్పుడే చూశాను..అద్భుతమైన కళాఖండం. భిన్నమైన భావోద్వేగాలు, ఉత్తేజం, తాదాత్మ్యం, ప్రేరణ..వంటివి కలిగిస్తుంది’ అని వర్మ ప్రశంసించారు.

ఈ సందర్భంగా పూరీ ఇటీవల పోస్ట్ చేసిన ‘హగ్’ పోస్టర్ ని వర్మ తన ఖాతాలో జతపరిచారు. కాగా, ఈ నెల 31న ఉదయం పది గంటలకు ‘హగ్’ను విడుదల చేయనున్నట్టు పూరీ ఇటీవల పేర్కొన్నారు. ’గెట్ రెడీ ఫర్ దిస్ వన్’ అంటూ తన అభిమానులకు ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా పూరీ చెప్పడం తెలిసిందే.

Director Verma praises Puri for 'Hag'!

- Advertisement -