కమెడియన్ వేణు దర్శకుడిగా తెరకెక్కిన చిత్రం బలగం. పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను ఈ సినిమా రాబడుతుండగా ఈ సినిమా కథపై వివాదం చోటు చేసుకుంది. కథ నాదే అంటూ గడ్డం సతీష్ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేయగా ఇది వైరల్‌గా మారింది. దీనిపై స్పందించారు వేణు.
అయన చెప్పిన కథ అయన చెప్పేదాకా కూడా నేను చదవలేదు, చూడలేదు. మా నాన్న, పెదనాన్న, బాబాయ్ లు ఇలా చాలా పెద్ద కుటుంబం మాది. మా నాన్న చనిపోయినప్పుడు మా కుటుంబం అంతా వచ్చి సపోర్ట్ చేశారు. మా మీద ప్రేమ చూపించారు. ఏడ్చారు, పనులు చేశారు. చావు దగ్గర అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇది నాకు 18 ఏళ్ళు ఉన్నప్పుడు జరిగింది. ఆ సంఘటన నాకు బలంగా గుర్తుండిపోయింది. మా ఇంకో పెదనాన్న చనిపోయాక, పెద్దమ్మ చనిపోయాక వెళ్లలేకపోయా షూటింగ్స్ లో ఉండి. దానికి మా అన్న బాధపడ్డాడు. ఈ విషయంలో అప్పట్నుంచి ఈ కథ రాయాలి అనుకున్నాను. మా చుట్టాలు ఇంకొకరు చనిపోతే తెలంగాణ బుడగ జంగాలు వచ్చి మా మీద పాటలు పాడారు. అందరూ ఏడ్చారు.
మా ఇంట్లో చూసిన అన్ని చావులు చూసి, కాకులు పిండాలు తినడం.. ఇవన్నీ మనకు ఎప్పట్నుంచో ఉంది. ఎవ్వరు కనిపెట్టలేదు. ఎవ్వరి సొత్తు కాదు. దీని మీద సినిమా రాద్దామని ఫిక్స్ అయినప్పుడు నేను కమెడియన్ కాబట్టి అప్పటివరకు రాసిన కామెడీ కథలు పక్కన పెట్టి ఈ కథ మీద కూర్చున్న. ఇది ఎవరి కథ కాదు. అందరి ఇళ్లల్లో జరిగే సంప్రదాయం. సాంప్రదాయాలను నాది అంటే ఎలా. సాంప్రదాయాలు మన అందరివీ. దీని మీద ఎవరైనా రాసుకోవచ్చు. ఇలాంటి కథల మీద ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చాయి. కానీ వారెవరు మాట్లాడలేదు. భవిష్యత్తులో కూడా చాలా సినిమాలు వస్తాయి. నేను కూడా మాట్లాడాను. ఎందుకంటే దీని మీద ఎవరైనా సినిమా తీయొచ్చు అని చెప్పారు. అంతేగానీ దీనిపై ఎవరిని అభాసుపాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..