అప్పుడే విజయ్‌తో సినిమా చేస్తా: తరుణ్ భాస్కర్

55
tharun
- Advertisement -

‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు తరుణ్​ భాస్కర్. ఇక విజయ్ దేవరకొండ, రాహుల్, తరుణ్ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు తరుణ్. తనకు వరుసగా మూడు ఫ్లాప్​లు వచ్చాక విజయ్​ దేవరకొండను వైల్డ్​ కార్డ్​లా వాడతా అని తెలిపారు.

చదువులో తాను పెద్దగా ఆసక్తి చూపించే వాడిని కాదని ..తాను కట్టిన సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజులతో ఒక బిల్డింగ్ కట్టవచ్చని చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం విజయ్ – సమంత నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ సినిమా షూటింగ్ సమంలో వీరిద్దరూ గాయపడ్డారని పుకార్లు రాగా వాటిని చిత్రయూనిట్ ఖండించింది.

అయితే పెళ్లిచూపులు సందర్భంగా విజయ్‌కి జరిగిన యాక్సిడెంట్‌ సీన్‌ను వివరించారు తరుణ్. షూటింగ్ సమయంలో ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అవ్వగానే విజయ్ బయపడ్డాడని …ట్రక్కు చెట్టును ఢీ కొట్టగా ఎవరికి గాయాలు కాలేదన్నారు. అయితే ఆ సమయంలో విజయ్ చెప్పిన సమాధానం ఇప్పటికి తనకు గుర్తుంది అన్నారు. మొదట భయమేసింది, కానీ తర్వాత అందరం చచ్చిపోతాం కదా, ఏముంది అని విజయ్ చెప్పాడని తెలిపారు తరుణ్.

- Advertisement -