ఆ దర్శకుడికి తొందర లేదట

25
- Advertisement -

కోటబొమ్మాళి పి.ఎస్ అనే సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు దర్శకుడు తేజ మార్ని. ఐతే, ఒక యావరేజ్ హిట్ పడినా ఫుల్ డిమాండ్ వచ్చే ఇండస్ట్రీ ఇది. పైగా పూర్తిగా అడ్వాన్సులు మీద నడిచే ఇండస్ట్రీ కూడా మన టాలీవుడే. ఫలానా దర్శకుడు హిట్ కొట్టాడంటే చాలు… నిర్మాతలు అడ్వాన్స్ లు ఇవ్వడానికి పోటీ పడతారు. వెంటనే ఆ దర్శకుడికి ఓ అరడజను అడ్వాన్సులు వచ్చి పడతాయి. కోటబొమ్మాళి పి.ఎస్ సినిమా దర్శకుడు తేజ మార్నికి కూడా ఇలాగే వచ్చి పడ్డాయి. కానీ, ఇంతవరకు ఏ నిర్మాత నుంచి ఈ దర్శకుడు అడ్వాన్స్ తీసుకోలేదు.

అదేమిటి ?, కోటబొమ్మాళి పి.ఎస్ లాంటి హిట్ సినిమా తీసి.. అడ్వాన్స్ ఎందుకు తీసుకోలేదు ?, అసలు ఏ సినిమా ఎప్పుడు చేస్తాడనేది అప్రస్తుతం. అడ్వాన్స్ తీసుకొని జేబులో వేసుకున్నామా ?, లేదా ? అనేదే పాయింట్ కదా. ప్రతి హిట్ దర్శకుడు ఈ సూత్రానికి విరుద్ధంగా ముందుకు పోడే. మరి దర్శకుడు తేజు మార్ని ఇంకా మార్కెట్లో ఖాళీగానే ఉన్నాడు ఎందుకు ?. అడ్వాన్స్ ఇచ్చేవాళ్లు చాలామంది ఉన్నా.. ఎందుకు వాటికి దూరంగా ఉంటున్నాడు. దీనికి రీజన్ కూడా చెబుతున్నాడు తేజు మార్ని. “వెంటనే మరో సినిమా ఎందుకు ఒప్పుకోవాలి.. కథ కుదరాలి కదా. అది నా మనసుకు నచ్చాలి. అప్పుడే మరో సినిమా ఒప్పుకుంటాను’ ఇలా సాగుతుంది తేజు మార్ని మాటలు.

దీపం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు పోగేసుకోవాలి కదా అంటే.. తేజు మార్ని మాట్లాడుతూ.. ‘నాకేం తొందర లేదు. వెంటనే అడ్వాన్స్ తీసేసుకొని సినిమా చేసేయాలని లేదు. మంచి సినిమాలు తీయాలనుకుంటున్నాను. దానికి కథతో పాటు అన్నీ కలిసి రావాలి. అలా కలిసొచ్చిన రోజు కచ్చితంగా అడ్వాన్స్ తీసుకొని సినిమా స్టార్ట్ చేస్తాను. “ఇలా తనకు తొందర లేదనే విషయాన్ని బయటపెట్టాడు కోటబొమ్మాళి పి.ఎస్ దర్శకుడు తేజు మార్ని. ప్రస్తుతం ఈ డైరక్టర్ దగ్గర 3 కథలున్నాయట. మరి ఎవరితో స్టార్ట్ చేస్తాడో చూడాలి.

Also Read:ఆ పాత్రలకు కూడా కృతి శెట్టి ఓకే

- Advertisement -