దర్శకుడు తాతినేని రామారావు ఇకలేరు..

133
ramarao
- Advertisement -

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు ఇకలేరు. కొంత కాలంగా అనారోగ్యం బాధపడుతున్న ఆయన చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో 1938లో జన్మించారు. తెలుగు, హిందీలో 70కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో నవరాత్రి, బ్రహ్మచారి, సుపుత్రుడు, రైతు కుటుంబం, దొరబాబు, ఆలుమగలు, శ్రీరామరక్ష, యమగోల, ఆటగాడు, అనురాగ దేవత, జీవనతరంగాలు, ఇల్లాలు, తల్లదండ్రులు, ప్రెసిడెంట్‌గారి అబ్బాయి వంటి విజయవంతమైన సినిమాలు ఆయన దర్శకత్వంలో తెరకెక్కినవే. హిందీలో లోక్‌-పరలోక్‌, అంధా కానూన్‌, ఇంక్విలాబ్‌, బేటీ నవంబర్‌ వన్‌ వంటి సినిమాలను రూపొందించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

- Advertisement -