ఓటీటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత రెండు నెలలుగా థియేటర్లు మూసి వేసిన సంగతి తెలిసిందే. దీంతో చిన్న సినిమాల నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చేసేదేమిలేక ఓటీటీలో సినిమాలను విడుదల చేస్తున్నారు. థియేటర్ లో సినిమా చూసిన ఆనందాన్ని ఓటీటీ ఇవ్వలేదని.. భవిష్యత్తు ఓటీటీదే అయితే నేను సినిమాలు తీయడం కష్టం అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
నా సినిమాలు థియేటర్ లో అయినా ఓటీటీలో అయినా అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాని చెప్పారు. సినిమా నిర్మాతలకు నష్టాలు రానంత వరకు సినిమాలను ఓటీటో విడుదల చేయడం మంచిదేనన్నారు. కాగా శంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పడు తమిళ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. దర్శకుడు శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో భారతీయుడు2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈమూవీని 2022లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్.