జగన్ ప్రమాణస్వీకారానికి వచ్చిన రామ్ గోపాల్ వర్మ

156
rgv

విజయవాడ ఇందిరా మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పలువురు అధితులు హాజరయ్యారు. ఈసందర్భంగా ప్రముక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఇక్కడకు వచ్చారు.

వర్మ మీడియాతో మాట్లాడుతూ.. తన జీవితంలో తొలిసారిగా ఓ రాజకీయ నాయకుడి ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చానని, ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయని చెప్పారు వర్మ. గత ప్రభుత్వం పాలనలో ఎంతో అసంతృప్తిగా ఉన్న ప్రజలు జగన్ తమకు ఎంతో చేస్తారని నమ్మి ఓట్లు వేశారని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ ఇష్టం వచ్చినట్టు హామిలు ఇవ్వలేదని త్వరలో తాను చేయబోయేవే చెప్పారన్నారు.