సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాకు తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు దర్శకుడు వర్మ. కొద్ది రోజుల క్రితం వెన్నుపోటు పాట విడుదల చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంట్రి ఇచ్చిన దగ్గరి నుంచి తన సినిమా ప్రారంభంమవుతుందని తెలిపారు వర్మ.ఇటివలే ఈసినిమాలోని ఎన్టీఆర్ మెషన్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ట్వీట్టర్లో మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు వర్మ. తాను కత్తి పట్టుకున్న ఫోటోను ట్వీట్టర్ లో షేర్ చేశాడు. దానికి తోడుగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు ఎవరైనా అడ్డొస్తే ఖబడ్డార్ అని కామెంట్ పెట్టారు. ఆతర్వాత మరో ట్వీట్లో రేయ్… ఎన్టీఆర్ కథానాయకుడు కాదు, మహానాయకుడు కాదురా… ఆయన అసలు నాయకుడు. ఆ విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకే లక్ష్మీస్ ఎన్టీఆర్ లోని అసలు కథలో తెలుస్తుందిరా. డబుల్ ఖబడ్దార్” అన్నారు. ఈమూవీ విడుదలయ్యే లోపు ఇంకెన్ని వివాదాలల్లో క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.
Aaey #LakshmisNTR release ki yevaraina addosthe Khabardaar
pic.twitter.com/NkVu4FnKwB
— Ram Gopal Varma (@RGVzoomin) February 4, 2019