క‌రోనాపై టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ ట్వీట్‌..

424
Director Rajamouli
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం భారత్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు 157 దేశాలకు కరోనా విస్తరించగా.. ఇండియాలో పంజా విసురుతోంది. దేశంలో తాజాగా మరో 11 మంది కరోనా వైరస్ అనుమానితులను ఓ ఆస్పత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం భారత్‌లో కరోనా కేసులు 110 కి చేరినట్లు సమాచారం. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు కరోనా నివారణకు హైలర్ట్‌ ప్రకటించాయి.

ఇక కరోనాపై ప్రముఖులు,సినీ సెలెబ్రెటీలు తమదైన రీతిలో ప్రజలకు అవగాహణ కల్పిస్తున్నారు. కరోనాపై టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ ఎస్‌ ఎస్‌ రాజ‌మౌళి త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. క‌రోనా కార‌ణంగా ప్రపంచం నిలిచిపోవ‌డం చూస్తుంటే షాకింగ్‌గా ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల‌లో భ‌యాందోళ‌న‌లు వ్యాప్తి చెంద‌కుండా చూడాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. కోవిడ్ 19 వ్యాప్తిని నివారించ‌డానికి ప్రామాణిక సూత్రాల‌ని పాటించండి. కరోనాపై కాస్త అప్ర‌మ‌త్తంగా ఉండండి అని రాజ‌మౌళి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -